కలం, వెబ్ డెస్క్: రాజమండ్రి (Rajahmundry) ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కల్తీ పాల బాధితులకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆయనపై ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నది. ఆయన స్థానంలో కెనడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీ పాల ఎఫెక్ట్‌తో సుమారు 15 మంది రాజమండ్రి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రోజురోజుకీ వీరి ఆరోగ్యం క్షీణిస్తోంది. బాధితుల్లో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

