కలం, వెబ్ డెస్క్: మహిళల టీ20 వరల్డ్ కప్ (Womens T20 World Cup)లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) పోరు పక్కా అయింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ మేరకు మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. భారత్-పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరుగనుంది. టోర్నీ జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్‌లో జరుగుతుంది. మొత్తం 12 జట్లు, 33 మ్యాచ్‌లు. ఫైనల్ జూలై 5న లార్డ్స్ స్టేడియంలో నిర్వహిస్తారు. గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో ఉంటుంది. పాకిస్తాన్ గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో పోటీ పడుతుంది. గ్రూప్-బీలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. టాప్ రెండు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. అవి జూన్ 30, జూలై 2న ది ఓవల్‌లో జరుగుతాయి.
పూర్తి షెడ్యూల్ ఇలా:
జూన్ 12: ఇంగ్లాండ్ vs శ్రీలంక – ఎడ్జ్‌బాస్టన్
జూన్ 13: స్కాట్లాండ్ vs ఐర్లాండ్ – ఓల్డ్ ట్రాఫోర్డ్
జూన్ 13: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా – ఓల్డ్ ట్రాఫోర్డ్
జూన్ 13: వెస్టిండీస్ vs న్యూజిలాండ్ – హాంప్షైర్ బౌల్
జూన్ 14: బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్ – ఎడ్జ్‌బాస్టన్
జూన్ 14: భారత్ vs పాకిస్తాన్ – ఎడ్జ్‌బాస్టన్
జూన్ 16: న్యూజిలాండ్ vs శ్రీలంక – హాంప్షైర్ బౌల్
జూన్ 16: ఇంగ్లాండ్ vs ఐర్లాండ్ – హాంప్షైర్ బౌల్
జూన్ 17: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ – హెడ్డింగ్‌లీ
జూన్ 17: భారత్ vs నెదర్లాండ్స్ – హెడ్డింగ్‌లీ
జూన్ 17: దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ – ఎడ్జ్‌బాస్టన్
జూన్ 18: వెస్టిండీస్ vs స్కాట్లాండ్ – హెడ్డింగ్‌లీ
జూన్ 19: న్యూజిలాండ్ vs ఐర్లాండ్ – హాంప్షైర్ బౌల్
జూన్ 20: ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ – హాంప్షైర్ బౌల్
జూన్ 20: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ – హాంప్షైర్ బౌల్
జూన్ 20: ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్ – హెడ్డింగ్‌లీ
జూన్ 21: వెస్టిండీస్ vs శ్రీలంక – బ్రిస్టల్
జూన్ 21: దక్షిణాఫ్రికా vs భారత్ – ఓల్డ్ ట్రాఫోర్డ్
జూన్ 23: న్యూజిలాండ్ vs స్కాట్లాండ్ – బ్రిస్టల్
జూన్ 23: శ్రీలంక vs ఐర్లాండ్ – బ్రిస్టల్
జూన్ 23: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ – హెడ్డింగ్‌లీ
జూన్ 24: ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ – లార్డ్స్
జూన్ 25: భారత్ vs బంగ్లాదేశ్ – ఓల్డ్ ట్రాఫోర్డ్
జూన్ 25: దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ – బ్రిస్టల్
జూన్ 26: శ్రీలంక vs స్కాట్లాండ్ – ఓల్డ్ ట్రాఫోర్డ్
జూన్ 27: పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ – బ్రిస్టల్
జూన్ 27: వెస్టిండీస్ vs ఐర్లాండ్ – బ్రిస్టల్
జూన్ 27: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – ది ఓవల్
జూన్ 28: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ – లార్డ్స్
జూన్ 28: ఆస్ట్రేలియా vs భారత్ – లార్డ్స్
జూన్ 30: సెమీఫైనల్ 1 – ది ఓవల్
జూలై 2: సెమీఫైనల్ 2 – ది ఓవల్
జూలై 5: ఫైనల్ – లార్డ్స్

