epaper
Sunday, March 1, 2026
epaper

శ్రీకాకుళంలో విజృంభిస్తున్న డ‌యేరియా!

క‌లం, వెబ్ డెస్క్‌: శ్రీకాకుళం (Srikakulam)లో డ‌యేరియా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా బుధ‌వారం మ‌రో ఆగ‌రుగురు డ‌యేరియా ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరారు. గ‌త మూడు రోజుల్లో సుమారు 70 మందికి పైగా డ‌యేరియా బారిన ప‌డ్డారు. బాధితుల‌కు ప్ర‌స్తుతం ప‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స కొన‌సాగుతోంది. డ‌యేరియా ప్ర‌భావిత ప్రాంతాల్లో మెడికాల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తాగు నీటి కోసం జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్ర‌త్యేక ట్యాంక‌ర్లు ఏర్పాటు చేసి నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.

ఎమ్మెల్యే శంక‌ర్‌, క‌లెక్ట‌ర్ దిన‌క‌ర్ ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి స్థానికుల‌తో మాట్లాడారు. ఇటీవ‌ల డ‌యేరియాతో మృతి చెందిన సురేష్ కుటుంబ‌స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు. కుటుంబ‌స‌భ్యుల‌కు రూ.10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను సైతం ప‌రామ‌ర్శించారు. మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!