కలం, డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 3.56 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పింఛనుదార్ల కుటుంబాల్లోని 17.08 లక్షల మందికి ఫ్రీ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి (Ponguleti )శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. వీరందరికీ రాష్ట్రంలోని 652 ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో 1998 డిసీజెస్ కు ఫ్రీ ట్రీట్ మెంట్ అందిస్తామని తెలిపారు. హెల్త్ కార్డ్ సిస్టమ్ ఉద్యోగుల బేసిక్ పే లోని 1.5% ను ట్రస్ట్ కు బదిలీ చేసి, అంతే మొత్తంలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు మంత్రి.
ఇప్పటి వరకు ఉన్న ఎంప్లాయీస్ ను లెక్కలోకి తీసుకుంటే.. రూ. 528 కోట్లు ఉద్యగుల నుంచి ట్రస్టుకు వస్తాయని.. అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా జమ చేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. 1,056 కోట్లతో ట్రస్ట్ రన్ అవుతుందని.. ఈ బోర్డు చీఫ్ సెక్రటరీ, మరికొందరు సభ్యుల ఆధ్వర్యంలో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్‌లో పూర్తిగా చర్చించామని.. అందుకు తగ్గట్టే ఆమోదం తెలిపామన్నారు మంత్రి.
అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా 60 ఏళ్లలోపు సహజ మరణం పొందితే వారికి రెగ్యులర్ బెన్ ఫిట్స్ తో పాటు అదనంగా రూ.10 లక్షలు అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. జెన్ కోలో ఉద్యోగులు ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వారికి ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా రూ.కోటి 25 లక్షలు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.


