కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన తిరుమల లడ్డూ (Tirumala Laddu)లో కల్తీ నెయ్యి అంశంపై సుప్రీం కోర్ట్ (Supreme Court) మరో కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వం ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్ట్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని తీర్పునిచ్చింది. చట్ట ప్రకారం సిట్, ఏకసభ్య కమిటీలు తమ బాధ్యత నిర్వర్తించాలని సూచించింది. సిట్ విచారణను ఈ కమిటీ ప్రభావితం చేస్తుందని భావించడం లేదని తెలిపింది. రెండూ తమ పరిధిలో దర్యాప్తు చేపట్టి నివేదికలు రూపొందించాలని సూచించింది.
Read Also: రాజకీయాలపై నిర్ణయం తీసుకోలేదు : వంగవీటి రంగా కుమార్తె
Follow Us On : WhatsApp


