కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ సూపర్-8లో (IND vs SA Super 8) భారత్ తొలి మ్యాచ్ అహ్మదావాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ పోరులో భారత్ చిత్తయింది. అత్యంత దారుణంగా తొలి ఓటమిని అందుకుంది. 188 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో అసలు భారత్ చేసిన తప్పేంటి? ఎక్కడ తేడా పడింది? అన్న చర్చ మొదలైంది. అయితే విశ్లేషకుల ప్రకారం.. భారత్ బ్యాటింగ్ అత్యంత పేలవంగా ఉండటమే మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణమంటున్నారు. మ్యాచ్‌కు ముందు టాస్ ఓడిపోవడం దగ్గర భారత్ ఓటమి ప్రయాణం షురూ అయిందని అభిప్రాయపడుతున్నారు.
188 పరుగుల ఛాలెంజింగ్ స్కోర్‌లు చేజ్ చేసే క్రమంలో నిలకడ బ్యాటింగ్ ప్రదర్శించడంలో భారత్ ఫెయిల్ అయిందని, ఓపెనర్లు ఇషాన్ కిషన్ (Ishan Kishan), అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఇద్దరూ కూడా కావాల్సిన బలమైన స్టార్ట్‌ను ఇవ్వలేకపోయారని వివరిస్తున్నారు. అంతేకాకుండా ఒక్క పరుగుకే తిలక్ వర్మ (Tilak Varma) ఔట్ అయిన తీరు ఫామ్ కోసం అతడు చేస్తున్న పోరాటాన్ని చూపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
దాంతో పాటుగా షాట్స్‌ను సెలక్ట్ చేసుకోవడంలో భారత ప్లేయర్లు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని, చెత్త షాట్లు ఆడి ఔట్ అయిన వాళ్లే ఎక్కువని వివరించారు. బ్యాటర్స్ అంతా కూడా ఈ మ్యాచ్ లో (IND vs SA Super 8) బాదడంపైనే ఫోకస్ పెట్టారు తప్పితే, మంచి భాగస్వామ్యం చేయడం గురించి కనీసం ఆలోచించలేదని, అక్కడే భారత బ్యాటింగ్ లైనప్, గెలిచే అవకాశాలు రెండూ పట్టాలుతప్పాయని నిపుణులు చెప్తున్నారు.
Read Also: నగరంలో ‘పెళ్లి’ మోసాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతి!
Follow Us On : WhatsApp


