epaper
Sunday, February 22, 2026
epaper

సీపీఐ బెదిరింపులకు భయపడం : కోనేరు చిన్ని

కలం, ఖమ్మం బ్యూరో: సీపీఐ నాయకుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్​ రాష్ట్ర నాయకులు కోనేరు చిన్ని అన్నారు. తమ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ(Palvancha) పట్టణంలోని వనమా కాలనీలో కాంగ్రెస్​ సేవాదళ్​ రాష్ట్ర జాయింట్​ సెక్రెటరీ ఎస్​జెకె. అహ్మద్​ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్​ కార్యక్రమాలకు హాజరైతే ఇందిరమ్మ ఇండ్లు ఆపేస్తామని సీపీఐ నేతలు బెదిరించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ బెదిరింపులకు తమ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. బెదిరింపులు మానుకోవాలని సీపీఐ నాయకులను ఆయన హెచ్చరించారు. సీపీఐ, బీఆర్​ఎస్​ నేతల బెదిరింపులకు కాంగ్రెస్​ కార్యకర్తలు భయపడాల్సిన పని లేదన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం కోనేరు చిన్నిని అహ్మద్ ఘనంగా సన్మానించారు(Palvancha).

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>