epaper
Sunday, February 22, 2026
epaper

మైనర్లతో లైంగిక అకృత్యాలు.. ‘ఇంజనీర్​’ దంపతులకు మరణశిక్ష

కలం, వెబ్​ డెస్క్: ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 33 మంది మైనర్లతో లైంగిక అకృత్యాలకు పాల్పడింది ఓ జంట(Banda Couple). ఏళ్ల తరబడి గుట్టుగా వాళ్లతో పాడు పనులు చేసింది, చేయించింది. వాటిని చిత్రీకరించి, నీలి చిత్రాలుగా మార్చి అమ్ముకుంది. మూడేళ్ల చిన్నారిని కూడా వదిలిపెట్టకుండా తమ పైశాచికత్వానికి వాడుకుంది. వాళ్ల నీచాతినీచమైన పనులు బయపడినప్పుడు సమాజం మొత్తం నివ్వెరపోయింది. అలాంటి కీచకులను కఠినంగా శిక్షంచాలన్న ప్రజల కోరిక నేటికి నెరవేరింది. ఆ చిన్నారులకు న్యాయం జరిగింది. మైనర్లతో వికృత చర్యలకు పాల్పడిన ఆ దంపతులకు మరణశిక్ష పడింది. వివరాలివీ..

ఉత్తరప్రదేశ్​ ఇరిగేషన్​ శాఖలో రామ్​ భవన్​ మాజీ జూనియర్​ ఇంజనీర్. అతని భార్య దుర్గావతి. బందాలో నివసించే ఈ దంపతులు(Banda Couple) 2010 నుంచి 2020 వరకు 33 మంది మైనర్​ బాలురతో చేయరాని పనులు చేయించారు. వీళ్లతో బ్లూ ఫిల్మ్స్​ తీశారు. వాటిని మార్కెట్​లో అమ్ముకున్నారు. ఐదేళ్ల కిందట వీళ్ల అకృత్యాలు బయటపడ్డాయి. దీంతో సీబీఐ రంగంలోకి నిందితులిద్దరినీ అరెస్ట్​ చేసింది. వీళ్లపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసును బాందాలోని స్పెషల్​ కోర్టు విచారణ జరిపింది. సాక్షాధారాలు పరిశీలించిన అనంతరం శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. ఇది దిగ్బ్రాంతి కలిగించే అత్యంత అరుదైన కేసని వ్యాఖ్యానిస్తూ.. నిందితులిద్దరికీ మరణశిక్ష విధించింది. అంతేకాదు, బాధిత బాలుర కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>