epaper
Monday, February 23, 2026
epaper

సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ పట్టివేత

కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మార్బుల్ షాపులో నిల్వ ఉంచిన 2.7 కిలోల నల్లమందు (OPIUM) డ్రగ్స్‌ను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 14 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఎస్ఓటి బృందం నిర్వహించిన దాడులతో ఎన్డీపిఎస్ (NDPS) చట్టానికి విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ మత్తు పదార్థాల దందా వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి వద్ద నుండి ఈ 2.7 కిలోల ఓపియం మత్తు పదార్థంతో పాటు లక్ష రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, రాజస్థాన్‌కు చెందిన మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్లను, స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను ఎస్ఓటి పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం అమీన్‌పూర్ పోలీసులకు అప్పగించారు. ఓపియం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసిన అమీన్‌పూర్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>