కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ సూపర్-8 కలను సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) నెరవేర్చాడు. అదిరిపోయే ఇన్నింగ్స్‌తో పాక్‌కు అద్భుతమైన విజయం సాధించాడు. పసికూన నమీబియాపై వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్‌తో ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. నమీబియాపై 58 బంతుల్లో అజేయ శతకం సాధించి జట్టును 200 పరుగుల భారీ స్కోరు దాకా నడిపించాడు. ఈ శతకంతో వరల్డ్‌కప్ చరిత్రలో సెంచరీ చేసిన రెండో పాకిస్థాన్ బ్యాటర్‌గా నిలిచాడు. 2014లో అహ్మద్ షెహ్జాద్ ఈ ఘనత సాధించాడు. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఫర్హాన్ 100 నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లలో 220 పరుగులతో రన్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరాడు. సగటు 73.33గా ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఫర్హాన్, సైమ్ అయూబ్ శుభారంభం అందించారు. ఐదు ఓవర్లలో 40 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయూబ్ 14 పరుగులకు అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ సల్మాన్ అలీ అఘా క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించి స్కోరును 100 దాటించారు. నాలుగో స్థానంలో వచ్చిన ఖ్వాజా నఫాయ్ ఐదు పరుగులకే అవుటయ్యాడు. ఫర్హాన్ మాత్రం తన దూకుడు కొనసాగించాడు. షాదాబ్ ఖాన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. షాదాబ్ 22 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టుకు వేగం అందించాడు.
ఈ శతకంతో ఫర్హాన్ (Sahibzada Farhan) అంతర్జాతీయ టీ20ల్లో శతకం చేసిన ఐదో పాకిస్థాన్ బ్యాటర్‌గా నిలిచాడు. బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ హారిస్, అహ్మద్ షెహ్జాద్, హసన్ నవాజ్ సరసన చోటు సంపాదించాడు. వరల్డ్‌కప్‌లో శతకం చేసిన 13వ బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. ఫర్హాన్ ఇన్నింగ్స్ పాకిస్థాన్‌కు బలమైన పునాది వేసింది. టోర్నీలో అతని ఫామ్ జట్టుకు కీలకంగా మారుతోంది.
కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 20 ఓవర్లకు 199/3 పరుగులు చేయగా, అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాకిస్థాన్‌కు 102 పరుగుల భారీ తేడాతో విజయం దక్కింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.


