epaper
Wednesday, February 18, 2026
epaper

వైసీపీకి షాక్.. సంతకం పెడితే సరిపోదు..

కలం, వెబ్​ డెస్క్​ : వైసీపీ ఎమ్మెల్యేలకు  ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. ఏపీ​ అసెంబ్లీ (AP Assembly) సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో అటెండెన్స్​ ను ఇక నుంచి డిజిటల్​ (Digital Attendance) రూపంలో నమోదు చేయాలంటూ స్పీకర్​ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆదేశాలు జారీ చేశారు. రిజిష్టర్​ లో సంతకం పెట్టడమే కాకుండా అసెంబ్లీలో కూర్చునే విధంగా సభాపతి కఠిన ఆంక్షలు ప్రవేశపెట్టాడు. ఇక నుంచి డిజిటల్​ రూపంలో హాజరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ మేరకు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం రేపటి (బుధవారం) నుంచి అమలు కానుంది. అయితే, వైసీపీ అధినేత జగన్​ తో పాటు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం (Digital Attendance)  చర్చనీయాంశంగా మారింది. జగన్ టార్గెట్​ గానే డిజిటల్ అటెండెన్స్​ విధానం తీసుకొస్తున్నారని తెలుస్తోంది.

Read Also: అసెంబ్లీకి జగన్.. వాటిపై ప్రశ్నిస్తారా.. సైలెంట్ అవుతారా..?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>