కలం, డెస్క్ : మొత్తానికి మాజీ సీఎం జగన్ (YS Jagan) అసెంబ్లీకి రాబోతున్నారు. గతేడాది బడ్జెట్ సమావేశాలకు వచ్చిన జగన్.. కేవలం పది నిముషాలు ఉండి వెళ్లిపోయారు. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి హాజరవుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ (Tirumala Laddu) నెయ్యి కల్తీ రచ్చ రచ్చగా మారింది. అటు కూటమి, ఇటు వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. సిట్ నివేదిక తమకు అనుకూలంగా వచ్చిందని వైసీపీ చెబుతోంది. లడ్డూలో కెమికల్ తో తయారు చేసిన నెయ్యిని వాడారని కూటమి ఆరోపిస్తోంది. ఇదే విషయంపై అసెంబ్లీలో చర్చిద్దామని కూటమి ప్రభుత్వం వైసీపీకి సవాల్ విసురుతోంది.
ఈ క్రమంలోనే జగన్ (YS Jagan) తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారని అంటున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పీపీపీతో పాటు తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై చర్చించే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అసెంబ్లీకి కంటిన్యూగా 60 రోజులకు మించి రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆ మధ్య డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు గానీ.. అసెంబ్లీకి రావట్లేదని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అప్పట్లో సమావేశాలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీకి వెళ్లాలని వైసీపీ (YCP) డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అసెంబ్లీకి (Assembly) వెళ్లక ఆరు నెలలు అవుతోంది కాబట్టి చర్యలు తప్పవని వెళ్లేందుకు డిసైడ్ అయ్యారా.. లేదంటే రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ నెయ్యి, పీపీపీ విధానాలపై ప్రశ్నించేందుకు వెళ్తున్నారా అనేదే ఇక్కడ సస్పెన్స్. గత అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినప్పుడు కేవలం పది నిముషాల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చారు. మరి ఈ సారి కూడా అలాగే వస్తారేమో అనే ప్రచారం కూడా ఉంది.
జగన్ అసెంబ్లీలో ప్రశ్నిస్తే చూడాలని ఆ పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ పట్టుబడుతున్నారు. మరి జగన్ ఈ సారి కూడా అదే పట్టు మీద ఉంటారా.. లేదంటే అసెంబ్లీలో చర్చలు జరుపుతారా అనేది చూడాలి.
Read Also: రూ.2 లక్షలకు బాలికను వృద్ధుడికి అమ్మేసిన తల్లి
Follow Us On: X(Twitter)


