కలం, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. బారాబంకీలోని శ్రీరామ్ జానకీ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అయోధ్యలో బాబ్రీ పునర్నిర్మాణం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. ‘ బాబ్రీ (Babri Masjid) నిర్మాణాన్ని మళ్లీ కట్టాలని కలలు కనేవాళ్లకు ఒక్కటే చెప్పాలి. వాళ్లు కోరుకుంటున్న ఖయామత్ (ఇస్లాం ప్రకారం ప్రపంచం అంతమయ్య రోజును ఖయామత్ అంటారు) రోజు ఎప్పటికీ రాదు. దానికోసం ఎదురుచూస్తూ బతకొద్దు. హిందుస్థాన్‌లో సరిగ్గా జీవించడం నేర్చుకోండి. ఈ దేశ చట్టాలను పాటించండి’ అని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించి, దాని ప్రకారం జీవిస్తే మేలు జరుగుతుంది. లేకపోతే చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లు నేరుగా జన్నత్(స్వర్గం) వైపు నడిచే పరిస్థితి తప్పదు ఆయన హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమిస్తూ కూడా జన్నత్‌కు చేరుకుంటామని అనుకోవడం కల అని, అవి ఎప్పటికీ నెరవేరవని యోగి స్పష్టం చేశారు.
అలాంటి వాళ్లను రాముడు మర్చిపోయాడు..
రాముడు, దేవుడు విషయంలో కొంతమంది అవకాశవాద దృక్పథంతో వ్యవహరిస్తున్నారని ఆదిత్యనాథ్ విమర్శించారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే రామున్ని తలచుకొని, మిగిలిన సమయంలో మర్చిపోతున్నారని అన్నారు. అలాంటి వాళ్లను రాముడు కూడా మర్చిపోయాడని వ్యాఖ్యానించారు. రామ భక్తులపై కాల్పులు జరిపినవాళ్లు, రామసేవకు అడ్డంకులు కలిగించిన ద్రోహులకు ఈ దేశంలో ఇక చోటు లేదని యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్పష్టం చేశారు.
Read Also: ఎంపీలే పొరపాటు చేస్తే… పార్లమెంటులో జరిగిందిదే..
Follow Us On: Sharechat


