కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) స్పందించారు. బిజెపికి ఓవైసీ దేవుడు అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. రాజకీయ దాడుల కోసం ప్రతిసారీ బిజెపి పేరును వాడుకుంటున్న రేవంత్ రెడ్డికి అసలు బిజెపియే దేవుడని ఆయన పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ముస్లింలకు ముప్పు ఉంటుందని భయపెడుతూ రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, కానీ బిజెపి అధికారంలో ఉంటేనే ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎంలు రాజకీయాల్లో విడదీయలేని సోదరులని, వారి మధ్య ఉన్న బంధం జగమెరిగిన సత్యమని రామచందర్ రావు విమర్శించారు.
Read Also: బైక్ మీద చేసే విన్యాసం.. నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం
Follow Us On : WhatsApp


