epaper
Wednesday, February 18, 2026
epaper

రష్యాలో నలుగురు భారతీయ విద్యార్థులపై కత్తితో దాడి

కలం, డెస్క్ : రష్యాలో (Russia) దారుణం జరిగింది. అక్కడ చదువుకుంటున్న నలుగురు భారతీయ స్టూడెంట్లపై కత్తితో దాడి చేశాడు ఓ దుండగుడు. బాష్కోర్తోస్థాన్ లోని ఓ యూనివర్సిటీ హాస్టల్ లోకి మెడికల్ యూనిఫామ్ లో ఉన్న యువకుడు కత్తితో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ స్టూడెంట్లపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అదుపులోకి తీసుకోవాలని చూసిన పోలీసులను కూడా గాయపరిచాడు. చివరకు తనను తాను కత్తితో పొడుచుకున్నట్టు రష్యా మీడియా వర్గాలు తెలిపాయి. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై రష్యాలో ఉన్న ఇండియన్ ఎంబసీ స్పందించింది. గాయపడ్డ నలుగురు స్టూడెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తున్నట్టు తెలిపింది. భారత అధికారులు సదరు యూనివర్సిటీకి బయలుదేరారని.. బాధితులతో టచ్ లో ఉన్నట్టు తెలిపింది.

Read Also: కీలక సమాచారం సేఫ్ : ఎఫ్‌ఎస్‌ఎల్​ డైరెక్టర్​ శిఖా గోయల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>