epaper
Thursday, February 19, 2026
epaper

వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు కీ ప్లేయర్ దూరం

కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌ 2026 (T20 World Cup 2026) ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా (Australia) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనుభవజ్ఞుడైన పేస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్(Josh Hazlewood) టోర్నీకి దూరమైనట్లు ఆస్ట్రేలియా తాజాగా స్పష్టం చేసింది. ఇరవై జట్లతో జరగనున్న టోర్నీకి ఒక రోజు ముందే ఈ నిర్ణయం వెలువడింది. గాయం నుంచి కోలుకుంటున్న హాజిల్‌వుడ్ సూపర్ ఎయిట్స్ దశ నాటికి సిద్ధంగా ఉంటాడని భావించినా, అతడికి ఇంకా విశ్రాంతి అవసరమని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. పునరావాస ప్రక్రియను వేగవంతం చేయడం ప్రమాదకరమని అధికారులు భావించారు. అందుకే వెంటనే ప్రత్యామ్నాయ ఆటగాడి ఎంపిక చేపట్టలేదని వెల్లడించారు.

ప్రారంభ మ్యాచ్‌లకు జట్టు సమతుల్యంగా ఉందని పేర్కొన్నారు. అవసరం వచ్చిన దశలోనే తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే  ఆస్ట్రేలియా శిబిరానికి కొంత ఊరట లభించింది. టిమ్ డేవిడ్ (Tim David) ఫిట్‌నెస్ సాధించాడు. నాథన్ ఎలిస్ (Nathan Ellis) కూడా పూర్తిగా సిద్ధమయ్యాడు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ ఆడమ్ జంపా ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు టోర్నీలో అడుగుపెట్టనుంది. పరిస్థితులను బట్టి ముందుకుసాగే దశల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటామని జట్టు యాజమాన్యం తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>