epaper
Wednesday, February 18, 2026
epaper

టారిఫ్స్​ తగ్గించడానికి కారణాలివేనా?

కలం, వెబ్​డెస్క్​: ‘అమెరికా ఫస్ట్​’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్​.. గతేడాది నుంచి టారిఫ్​లతో వివిధ దేశాలపై విరుచుకుపడ్డారు. నిరుడు ఏప్రిల్​ నుంచి భారత్​పైనా టారిఫ్స్​తో రెచ్చిపోయారు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా సుంకాల విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. భారత్​పై విధించిన 25శాతం టారిఫ్స్​ను 18శాతానికి తగ్గించారు (US tariff cuts). దీనికి అనేక కారణాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి..

  • ఇతర దేశాలపై ట్రంప్​ విధిస్తున్న టారిఫ్​లపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. ఈ ఏడాది మార్చిలో తుది తీర్పు రావాల్సి ఉంది. ఆ తీర్పు టారిఫ్​లకు వ్యతిరేకంగా వస్తే తన ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించి ముందుగానే ట్రంప్​ ఇలా ప్రిపేర్​ అయినట్లు తెలుస్తున్నది. ఆ క్రమంలోనే టారిఫ్స్​ను కాస్త తగ్గించి.. వాటిని చట్టబద్ధం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు చూస్తున్నారు.
  • ఇండియా నుంచి వచ్చే వస్తువులపై.. ముఖ్యంగా స్పేర్​ పార్ట్స్​ వంటి వాటిపై భారీగా టారిఫ్​లు అమలవడంతో తమకు కష్టంగా మారిందని, దేశ ద్రవ్యోల్బణం పడిపోతుందని అమెరికాలోని కార్పొరేట్​ కంపెనీలు ట్రంప్​పై ఇన్నాళ్లూ ఒత్తిడి తెచ్చాయి. దీని ఫలితమే ట్రంప్​ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
  • ఇక అన్నింటికంటే ముఖ్యం.. తాను చెప్పినట్లుగా రష్యా నుంచి ఆయిల్​ కొనుగోళ్లను ఇండియా భారీగా తగ్గించిందని ట్రంప్​ అంచనాకు రావడం. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం కొనసాగించడానికి కారణాల్లో మాస్కో నుంచి ఇండియా ఆయిల్​ కొనడం ఒకటని అంతకుముందు అనేక వేదికలపై పదే పదే ట్రంప్​ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా నుంచి భారత్​ ఆయిల్​ కొనడం లేదని అగ్రరాజ్యం అధ్యక్షుడు అనుకుంటున్నారని, టారిఫ్స్​ తగ్గించడానికి (US tariff cuts) ఇదీ ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. అయితే, రష్యా నుంచి ఆయిల్​ కొనడం ఆపేశామని భారత్​ అధికారికంగా ప్రకటించలేదు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>