కలం, వెబ్ డెస్క్ : తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు (Bullet Trains) కేటాయించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, రైల్వే ప్రాజెక్టుల వివరాలను ఆయన వెల్లడించారు. తెలంగాణ రైల్వే అభివృద్ధికి మొత్తం రూ. రూ. 5,454 కోట్ల నిధులు కేటాయించామన్నారు. హైస్పీడ్ రైళ్ల వల్ల హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటలు, చెన్నైకి 2 గంటలు 55 నిమిషాలు, పుణేకు 1 గంట 45 నిమిషాల్లో వెళ్లవచ్చు.
ఈ నగరాల మధ్య హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ (High Speed Bullet Trains) సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లు అన్నీ.. ఎలివేటెడ్ కారిడార్‌లుగా నిర్మిస్తామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి చెప్పారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులతో హైదరాబాద్‌ను హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇది ‘సౌత్ ఇండియా డైమండ్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ ’గా రూపు దిద్దుకుంటుందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.
Read Also: ఏఐ మరో దెబ్బ.. అమెజాన్ బాటలో ఒరాకిల్!
Follow Us On: X(Twitter)


