epaper
Monday, February 2, 2026
spot_img
epaper

క‌శ్మీర్‌లో భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 4.8 తీవ్ర‌త న‌మోదు

క‌లం, వెబ్‌డెస్క్‌: జమ్మూకాశ్మీర్‌ (Jammu Kashmir)లో సోమవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. ఉదయం 5 గంటల‌కు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.8గా నమోదైంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపిన వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం బుద్గాం జిల్లాలో ఉంది. భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సమయంలో కేంద్ర ప్రాంతంలో ఆకాశం మేఘావృతంగా ఉండగా, ఉష్ణోగ్రత మైనస్ 0.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భూకంప ప్రభావం చారార్ ఇ షరీఫ్, పుల్వామా, శ్రీనగర్, షోపియాన్ ప్రాంతాల్లో కూడా కనిపించింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ అండమాన్ నికోబార్ (Andaman Nicobar) దీవుల్లో కూడా భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం తెలిపిన ప్రకారం ఉదయం 3 గంటలకు ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రత నమోదైంది. ఈ భూకంప కేంద్రం నికోబార్ ప్రాంతంలో ఉండగా, భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అయితే ఈ రెండు ఘ‌ట‌న‌ల్లో ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని స‌మాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>