కలం, తెలంగాణ బ్యూరో: సర్ ప్రైజులు లేవు.. వరాలు లేవు.. వడ్డింపులూ లేవు! కేంద్రం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ (Budget) అంతా సాదాసీదా!! స్టాక్ మార్కెట్లకు పెద్దగా నచ్చలేదు. వ్యాపారవర్గాలు ఉసూరుమన్నాయి. సామాన్యులకు పెద్దగా ఊరట లేదు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపై మునుపటిలా ఓట్ల కోసం వరాలు కురిపిస్తారన్న ముందస్తు అంచనాలు కూడా బెడిసికొట్టాయి. ‘వికసిత్ భారత్ –2047’ లక్ష్యంగా బడ్జెట్ ను తెస్తున్నామని ఆదివారం పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు.
అంతకంతకూ పెరిగినా..!
కేంద్ర బడ్జెట్ (Budget) విలువ నానాటికీ పెరిగిపోతున్నది. 2025–26 బడ్జెట్ తో పోలిస్తే.. ప్రస్తుతం 6.8 శాతం పెరిగింది. నిరుడు 50,65,345 కోట్లు ఉండగా.. ఇప్పుడు అది 53,47,351 కోట్లకు చేరింది. ఇందులో ఎప్పటిలాగే రక్షణ రంగానికి పెద్ద పీట వేశారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు రూ. 1.4 లక్షల కోట్లను కేటాయించారు.
కర్తవ్య భవన్ .. 3 కర్తవ్యాలు
కర్తవ్య భవన్ లో రూపుదిద్దుకున్న తొలి బడ్జెట్ ఇది అని నిర్మలమ్మ ప్రకటించారు. మూడు కర్తవ్యాలే పునాదులుగా దీన్ని తెస్తున్నామని చెప్పారు.
1. ఆర్థిక వృద్ధి స్పీడప్: అంతర్జాతీయ పోటీని తట్టుకొని నిలబడేలా దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడం.
2.ప్రజల ఆకాంక్షలు ఫలించడం: దేశ ప్రజల స్కిల్స్ ను పెంచి, దేశాభివృద్ధిలో అన్నివర్గాలను భాగస్వామ్యం చేయడం. విద్య, స్కిల్ డెవలప్ మెంట్ తో యువతకు ఉపాధి కల్పించడం.
3. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్: ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు అందేలా చూడటం. వెనుకబాటు నుంచి దూరం చేయడం.
Read Also: బడ్జెట్ ఎఫెక్ట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ
Follow Us On: Instagram


