epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

రెండో టీ20లో పాక్ హవా.. ఆసీస్‌పై 90 పరుగుల విజయం

కలం, వెబ్ డెస్క్ : లాహోర్‌లో పాకిస్థాన్ (Pakistan) పవర్ స్పష్టంగా కనిపించింది. రెండో టీ20లో ఆస్ట్రేలియాను( Australia) 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో పాక్ బలమైన సందేశం ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ ఆగా (Salman Agha) 76 పరుగులతో ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు. ఉస్మాన్ ఖాన్ 53 పరుగులతో రన్స్ వేగాన్ని కొనసాగించాడు. ఆసీస్ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది.

11వ ఓవర్లో కామెరాన్ గ్రీన్ ఔట్ కావడం కీలక మలుపుగా చెప్పవచ్చు. ఉస్మాన్ తారిక్ బంతిని గ్రీన్ సరిగ్గా అంచనా వేయలేక క్యాచ్ ఇచ్చాడు. అప్పటివరకు 35 పరుగులతో గ్రీన్ మాత్రమే ప్రతిఘటన చూపించాడు. తర్వాత ఆసీస్ బ్యాటింగ్ పూర్తిగా కూలిపోయింది. 15.4 ఓవర్లకే 108 పరుగులకు ఆలౌట్ అయింది. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ తలా మూడు వికెట్లు తీసి స్పిన్ మాయ చూపించారు. మొత్తంగా పాకిస్థాన్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను సులువుగా తమ ఖాతాలో వేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>