కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup Song) జోరు క్రికెట్ ప్రపంచమంతా మొదలైంది. ఇప్పటికే దాదాపు అన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించేశాయి. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేమికులకు ఐసీసీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. టోర్నీ అధికారిక పాట ‘Feel the Thrill’ను విడుదల చేసింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకల్లో ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచి ఆలపించినట్టు ఐసీసీ వెల్లడించింది.
దేశాలు తలపడే వేళ మ్యాచ్‌ను కేవలం చూడటం కాదు, అనుభూతిగా మార్చేలా ఈ పాట రూపుదిద్దుకున్నట్టు తెలిపింది. ఉత్సాహభరితమైన బీట్లు, టీ20 క్రికెట్లో కనిపించే భావోద్వేగాలు, ఉద్వేగం ఈ పాటలో ప్రతిఫలిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గర్వంగా ఉందని అనిరుధ్ తెలిపారు. క్రికెట్ అనేది ఆటకంటే ఎక్కువగా ఒక భావన అని, చీర్ అయినా నిశ్శబ్ద క్షణమైనా ప్రతి హృదయ స్పందన ఒకే తాళంలో కలుస్తుందని చెప్పారు. ‘Feel the Thrill’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఒక్క భావనతో కలపాలన్నదే తమ ప్రయత్నమని వెల్లడించారు.
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup Song) 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు కొనసాగనుంది. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొని మొత్తం 55 మ్యాచ్‌లు ఆడనున్నాయి. సెమీఫైనల్స్, ఫైనల్‌తో షెడ్యూల్ ఉత్కంఠగా సాగనుంది. నాలుగు గ్రూపులుగా విభజించిన ఈ పోటీల్లో ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ ఎయిట్ దశకు అర్హత సాధిస్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఇప్పటికే జట్టును ప్రకటించిన తొలి జట్టుగా నిలిచింది. గ్రూప్–Aలో భారత్, పాకిస్థాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఉండటంతో టోర్నీ ఆరంభంలోనే హై వోల్టేజ్ పోరులు జరగనున్నాయి.
Read Also: హైదరాబాద్‌లో రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య
Follow Us On: Pinterest


