కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్లో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) తెరపైకొచ్చింది. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఓ గొప్ప ఇండస్ట్రీ అని, బిహేవియర్ స్ట్రిక్ట్‌గా ఉంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఉండదన్నారు. ఇక్కడ ఎవరైనా రాణించట్లేదంటే అది వారి తప్పిదమేనని ఆయన అన్నారు. ప్రొఫెషనల్‌గా ఉంటే అవతలివాళ్లు కూడా ప్రొఫెషనల్‌గా ఉంటారని చిరంజీవి కామెంట్స్ చేశారు. చిరుపై కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) ఉందని ఆయన అన్నారు. కొన్నేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీని శాసించిన రాజులు, జమీందారులు మహిళల కోసమే సినిమాలు తీశారని గుర్తు చేశారు. లొంగకపోతే అవకాశాలు ఇచ్చేవారు కాదన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయని, అయితే ఇప్పడు కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: నిజాం నగలను హైదరాబాద్‌కు పంపే ఆలోచన లేదు: కేంద్రం
Follow Us On: Instagram


