కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లా కొణిజర్ల (Konijerla) మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని బోడియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సుమారు 32 మంది విద్యార్థులకు వరుసగా వాంతులు, విరోచనాలు కావడంతో పాటు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. ఆహారం కలుషితం కావడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ (Food Poisoning) జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
స్థానికులు, పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి, బాధితులందరినీ చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: నిజాం నగలను హైదరాబాద్కు పంపే ఆలోచన లేదు: కేంద్రం
Follow Us On: Pinterest


