కలం, జనగామ: మేడారం (Medaram)లో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తీసుకెళ్లే గొర్రెలు, మేకలకు కూడా కండక్టర్లు బస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. జనగామ (Jangaon) నుంచి మేడారానికి వెళ్లే భక్తుల నుంచి ఒక్కో మేక, గొర్రెకు రూ.400 వసూలు చేస్తున్నారు. జనగామ నుంచి మేడరానికి బస్సు టికెట్ పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.250 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గొర్రె, మేకలకు ఛార్జీలు తీసుకోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు టికెట్ ధర రూ.400 చాలా ఎక్కువని ప్రశ్నిస్తున్నారు.


