epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

అజిత్ పవార్ విమాన ప్రమాదానికి కారణమిదే..!

క‌లం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్(Ajit Pawar) బారామ‌తిలో జ‌రిగిన విమాన ప్ర‌మాదం(Plane Crash)లో ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న‌తో పాటు ఈ ప్ర‌మాదంలో మ‌రో ఐదుగురు మృతి చెందిన‌ట్లు డీజీసీఏ వెల్లడించింది. వీరిలో ఇద్ద‌రు పైలెట్లు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. అజిత్ ప‌వార్ మృతితో ఈ విమాన‌ ప్ర‌మాదం దేశ వ్యాప్త‌ంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఘటనపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన అధికారులు విమానంలో సాంకేతిక లోప‌మే(Technical Glitch) ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు. ముంబయి నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం.

విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న స‌మ‌యంలో రన్ వే పై విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. పైలట్ గందరగోళానికి గురై విమానంపై పట్టుతప్పిపోయాడు. అనంతరం విమానం రన్ వే పక్కన కుప్ప‌కూలిపోయి రెండు ముక్క‌లైపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి.

ఈ విమానం ముంబ‌యిలోని ప్రైవేట్ సంస్థ‌ వీఎస్ఆర్ వెంచ‌ర్స్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. విమానం బంబార్డియ‌న్ లీర్జెట్ 45 ర‌కంగా పేర్కొన్నారు. 8 మంది ప్రయాణం చేయగలిగే ఈ విమానం చిన్న చార్టెడ్ ఫ్లైట్ అని, సాంకేతిక లోపంతోనే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విమానానికి కెప్టెన్ సాహిల్ మదన్, కెప్టెన్ యశ్ నేతృత్వం వ‌హించిన‌ట్లు తెలిపారు.

Read Also: హార్వర్డ్‌లో సీఎం రేవంత్‌ కీలక భేటీ.. తెలంగాణ రైజింగ్‌పై చర్చ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>