కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ప్రయాణిస్తున్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం అజిత్ పవార్ బారామతి(Baramati)లో ఓ సభ కోసం విమానంలో బయలుదేరారు. బారామతి విమానాశ్రయం వద్ద విమానం ల్యాండ్ అవ్వడానికి ముందు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎయిర్ పోర్ట్ సిబ్బంది అజిత్ పవార్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Also: సింగింగ్‌కు అరిజిత్ సింగ్ అల్విదా
Follow Us On: Pinterest


