కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2(Group-2)కు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ఏపీపీఎస్సీ(APPSC) మంగళవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది. ఏపీపీఎస్సీ(APPSC) 905 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తుది జాబితాలో 891 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. కోర్టు చిక్కుల నేపథ్యంలో కొన్ని పోస్టులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ పోస్టులకు సంబంధించి 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసి, 2024 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, 2025 ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు.2025 ఏప్రిల్లో ఫలితాలు వెల్లడించారు. పోస్టుల కేటాయింపులపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో తుది జాబితా విడుదలకు ఆలస్యమైనట్లు తెలుస్తోంది.


