కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Rajanarsimha) అన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తూ విద్యారంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్లో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన – 2026 ముగింపు వేడుకల్లో మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Rajanarsimha) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీ ప్రపంచంలో మన పిల్లలు రాణించాలంటే భాషా ప్రావీణ్యం, స్కిల్ డెవలప్మెంట్, సృజనాత్మకత తప్పనిసరిగా అవసరమన్నారు. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులలో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, ఐక్యూ స్థాయిని పెంచుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజి రెడ్డి పాల్గొన్నారు.


