కలం, వెబ్ డెస్క్ : భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి.. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు దొరికిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఒక బాధితుడికి చెందిన 8.35 ఎకరాల భూమిని సాదా బైనామా కింద రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన దస్తావేజును ప్రాసెస్ చేసి పంపేందుకు విద్యాసాగర్ రెడ్డి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీనిపై సదరు వ్యక్తి ఏసీబీ (ACB) అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం, డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ బృందం దాడి చేసి అధికారిని అదుపులోకి తీసుకుంది.
ప్రభుత్వ సేవలు అందించే క్రమంలో ఏ అధికారి అయినా లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 లో సంప్రదించాలని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
Read Also : జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. జైషే ఉగ్రవాది హతం
Follow Us On : Twitter


