epaper
Friday, January 23, 2026
spot_img
epaper

అమెజాన్​ ఉద్యోగులకు ముంచుకొస్తున్న లేఆఫ్​ గడువు!

కలం, వెబ్​డెస్క్​: సాఫ్ట్​వేర్​​ ఉద్యోగులను లేఆఫ్​ వెంటాడుతోంది. టెక్​ దిగ్గజాలు ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగస్తులను సాగనంపుతున్నాయి. ఇటీవల భారతీయ టెక్​ జెయింట్​ టీసీఎస్​ గత మూడు నెలల కాలానికి దాదాపు 12వేల మందిని తొలగించింది. అంతకుముందు దాదాపు 80వేల మందిని ఇంటికి పంపింది. ఇప్పుడు అదే బాటలో అమెజాన్ వేల మందిని తొలగించనుంది (Amazon layoffs)​. ఈ మేరకు జనవరి 27న 14వేల మందిని తొలగించేందుకు ప్రణాళకలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల తగ్గింపులో మొత్తం 30 వేల మందికి లేఆఫ్​ ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రకటించిన అమెజాన్​.. మొదటి దశలో నిరుడు అక్టోబర్​లో 14వేల మందిని తొలగించింది. ఇప్పుడూ అంతే సంఖ్యలో సాగనంపనుంది. కాగా, 2022, 2023లో 27వేల మందికి అమెజాన్​ లేఆఫ్​ ఇచ్చింది. కంపెనీ​ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.58 మిలియన్లు కాగా.. రెండో దశ తొలగింపుతో 10శాతం కోత పడనుంది.

ఎవరిపై ప్రభావం?

అమెజాన్​ వెబ్​ సర్వీస్​(AWS), రిటైల్​ సెక్టార్​, ప్రైమ్​ వీడియో, హెచ్​ఆర్​ రంగాలపై లేఆఫ్​ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కాగా, నిరుడు  తొలగించినవాళ్లకు వేతనంతో మూడు నెలల సమయం ఇచ్చారు. వేరే ఉద్యోగం వెతుక్కునేందుకు ఈ అవకాశం కల్పించారు.

ఎందుకీ కోతలు?

ఏఐ ప్రభావం, ప్రాజెక్టులు లేకపోవడం, ఫెర్మార్సెన్స్​ తగ్గడం సాకుగా అమెజాన్​ చెబుతోంది. అయితే, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) కారణంగానే ఎక్కువ మంది తొలగింపునకు గురవుతున్నారు. నిరుడు కంపెనీ అంతర్గత లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ‘ఇంటర్నెట్​ జమానాలో అత్యంత విప్లవాత్మక టెక్నాలజీ ఏఐ. కంపెనీలు కొత్త కొత్త ఆవిష్కరణలు వేగంగా చేయడానికి ఇది ఉపయోగపడుతోంది’ అని ఆ లెటర్​లో అమెజాన్​ పేర్కొంది.

అమెజాన్​ సీఈవో ఆండీ జెస్సీ మాత్రం లేఆఫ్స్​కు ఆర్థిక భారం, ఏఐ కారణం కాదంటున్నారు. కంపెనీల్లో పాతుకుపోయిన ‘బ్యూరోక్రసీ’, అధిక అంచెల(లేయర్స్​) విధానం వల్లే ఇది జరుగుతోందని చెబుతున్నారు. అయితే, 2025లో తొలగింపుల సందర్భంగా లేఆఫ్స్​కు ఏఐ కారణమని ఆయన పేర్కొనడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>