కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) “నారీ నారీ నడుమ మురారి”(Nari Nari Naduma Murari) సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని శర్వానంద్‌కు ఈ సినిమా సూపర్ హిట్ అందించింది. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన నారీ నారీ నడుమ మురారి మూవీ అందరి అంచనాలను మించిన సక్సెస్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) తనకు ఏడేళ్ల తర్వాత హిట్ ఇచ్చాడని, ఇలాంటి బ్యానర్లో మళ్లీ సినిమా చేయబోతున్నట్లు శర్వానంద్ తెలిపాడు. ఒక హీరో, నిర్మాత కలిసి వర్క్ చేస్తే ఎంతమంచి మూవీస్ వస్తాయో చూపిస్తానని అన్నాడు. అనిల్ సుంకర ప్రొడక్షన్లో తరువాత చేయబోయే మూవీకి రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోనని, ఫ్రీగా సినిమా చేస్తానని శర్వానంద్ మాటిచ్చాడు.
శర్వానంద్ మాటలతో నిర్మాతతో పాటు ఈవెంట్లో పాల్గొన్న వారు సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ అనేది మొత్తం ప్రొడక్షన్ కాస్ట్లో మేజర్ అమౌంట్. ఫ్రీగా సినిమా చేస్తానని హీరో చెప్పాడంటే ఆ బడ్జెట్లో చాలా వరకు తగ్గినట్లే అవుతుంది. ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడుతున్న అనిల్ సుంకర లాంటి నిర్మాతకు శర్వానంద్ ఇచ్చిన హామీ చాలా పెద్దదే అని చెప్పవచ్చు.


