కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రకటించారు. దావోస్‌లో (Davos) జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో (WEF) మంత్రి నారా లోకేశ్, సీఎం చంద్రబాబు పలు కంపెనీల యాజమాన్యాలతో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ యూఏఈ మంత్రితో భేటీ అయ్యారు.
రాష్ట్రం నుంచి ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిపై చర్చించారు. ఆక్వా రంగంలో, ఉద్యాన పంటల ఉత్పత్తిలో ఏపీ ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో సదరు ఉత్పత్తులకు మంచి మార్కెట్ సృష్టించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సు వేదికగా ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి లోకేశ్ (Nara Lokesh) వెల్లడించారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక పార్కులపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ప్రకృతిని సాగు చేద్దాం, భూమిని బాగు చేద్దామని దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు ప్రపంచానికి పిలుపునిచ్చారు.
Read Also: మళ్లీ పాదయాత్ర.. జగన్ కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)


