కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇప్పటికే భారీగా ఐపీఎస్, ఐఏఎస్లు బదిలీలు కాగా, తాజాగా హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరోసారి భారీ ప్రక్షాళన జరిగింది. మొత్తం 54 మంది సీఐలను బదిలీలు చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎస్ సైబర్ క్రైమ్స్ నుంచి భారీగా బదిలీలు జరిగాయి. 26 మంది సీఐలను సీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 54 మంది సీఐ (CI)ల బదిలీలు జరిగి ఉండవచ్చునని పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి.


