epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

కోహ్లీ, నితీశ్ రెడ్డి.. ఫిఫ్టీ ఫిఫ్టీ!

కలం డెస్క్: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా (Team india) ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), నితీశ్ కుమార్ రెడ్డి (Nitish kumar reddy) చెరో ఫిఫ్టీ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 రన్స్ చేసింది. 338 పరుగుల టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన భారత క్రికెటర్లు తడబడ్డారు. 71 పరుగులకే రోహిత్ శర్మ (11), శుభమన్ గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) ఔటయ్యారు. నిదానంగా ఆట మొదలుపెట్టిన కోహ్లీ.. 5 ఫోర్లు, ఒక్క సిక్సర్ తో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 రన్స్ పూర్తి చేసి పుష్పా స్టైల్​ లో సెలబ్రేషన్​ చేసుకున్నాడు. అనంతరం మరో రెండు బాల్స్​ కు నితీశ్​ కూడా వెనుదిరిగాడు.

Read Also: మృత్యువుపై విజయం.. ఇప్పుడు 2026కే ఛాలెంజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>