కలం, మెదక్ బ్యూరో: సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి (Komuravelli) మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, మహాజాతర ఆదివారం నుంచి ప్రారంభం అయ్యింది. తొమ్మిది వారాలపాటు మల్లన్న జాతర కొనసాగనుంది. ప్రతి ఏడు ఉగాది వరకు అత్యంత వైభవంగా బ్రహోత్సవాలు జరుగుతుంటాయి. జాతరలో ముఖ్య ఘట్టమైన పట్నాల కార్యక్రమం నేటి నుంచి మొదలు కానున్నది.
కొమురవెల్లి జాతరలో మొదటి వారంను పట్నంవారంగా పిలుస్తారు. భక్తులు అలయ పరిసరాల్లో పట్నాలు వేసి, బోనాలు సమర్పించి , బండారి మొక్కులు చెల్లించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహరాష్ట్ర , ఛత్తీస్ ఘడ్ నుంచి భక్తులు జాతరకు వస్తుంటారు. పట్నంవారం సందర్బంగా కొమురవెల్లికి లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో పోలిసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయశాఖ, అలయ పాలకమండలి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి కొండపోచమ్మ జాతర
కొమురవెల్లి మల్లన్నకు చెల్లెలుగా భావించే కొండపోచమ్మ అమ్మవారి జాతర నేటి నుంచి ప్రారంభమౌతున్నది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయంలో మూడు నెలలపాటు జాతర కొనసాగనుంది . భక్తులు పుణ్య స్నానాలు అచరించి అమ్మవారికి బోనాలు, నైవేద్యలు సమర్పిస్తారు.

Read Also: నేటి నుంచి నాగోబా జాతర
Follow Us On: X(Twitter)


