కలం, వెబ్ డెస్క్ : కాకినాడలో AM గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు (Green Ammonia Project) శంకుస్థాపనలో పాల్గొన్న సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్ద పీట వేశామని తెలిపారు. ముందు ఇచ్చిన సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామని, సూపర్ సిక్స్ (Super Six) హామీని సూపర్ హిట్ చేశామని చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్దిని పరిగెత్తిస్తున్నాం. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా చేసిన సర్వే ప్రకారం దేశంలో వచ్చిన పెట్టుబడులలో 25 శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ (CII) సమ్మిట్‌లో భాగంగా 13 లక్షల 25 వేల కోట్ల పెట్టుబడులకి ఎంఓయులు (MOU) చేశామని, దాని వల్ల 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు వెల్లడించారు.

Read Also: గ్రీన్ అమ్మోనియా మొదటి ఉత్పత్తి ప్రారంభం అప్పుడే : చంద్రబాబు
Follow Us On: X(Twitter)


