కలం, వరంగల్ బ్యూరో : ములుగు (Mulugu) మున్సిపాలిటీ పరిధి లోని ఆరు, ఏడు, ఎనిమిది, పందొమ్మిది డివిజన్ కు చెందిన ఓటర్ జాబితాలోని చనిపోయిన వారి పేర్లు తొలిగించాలంటూ ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతనిప్పుల భిక్షపతి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా దేవగిరిపట్నం పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సానికొమ్ము సురేశ్ రెడ్డికి మరో ఓటు ములుగు మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులో ఉన్నందున విచారణ జరిపి తొలగించాలని కోరారు.
Read Also: వెండి ధరలు భారీగా పెరగబోతున్నాయా..?
Follow Us On: Sharechat


