epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

నిజామాబాద్‌లో దారుణం.. నోట కరుచుకున్న నాటుబాంబు పేలి ఆవు మృతి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్‌లో నాటుబాంబు కలకలం రేపింది. నోట కరుచుకున్న నాటుబాంబు పేలడంతో ఓ ఆవు మృతిచెందింది. స్థానికుల సమాచారం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు అడవి పందుల వేట కోసం పేలుడు పదార్థాలు తవుడులో ముద్దగా పెట్టి ఉంచారు. దూపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్‌కు చెందిన ఆవు మేతకు వెళ్లింది. ఈ క్రమంలో నాటుబాంబు ముద్దను తినగానే నోట్లో పేలుడు సంభవించింది. తీవ్ర గాయాలపాలై ఆవు మృతి చెందింది. ఈ సంఘటనతో ఆవు యజమాని తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

గ్రామ శివారుల్లో అక్రమంగా వన్యప్రాణుల వేట కోసం నాటు బాంబులు వినియోగించడం పశువులకే కాకుండా జనాలకు కూడా ప్రాణ సంకటంగా మారిందని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఇలాంటి ఘటననే ఐదేళ్ల క్రితం డిచ్‌పల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో జరిగింది.

Read Also: మున్సి ‘పోల్స్‘ బరిలో ట్రాన్స్‌జెండర్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>