కలం, వెబ్ డెస్క్: భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) గాయం కారణంతో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 (T20 Squad) సిరీస్‌కు దూరమయ్యాడు. జనవరి 11న వడోదరాలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో దిగువ పక్కటెముకల దగ్గర అతడికి అకస్మాత్తుగా నొప్పి వచ్చింది. వైద్య పరీక్షల తర్వాత వైద్యులు సైడ్ స్ట్రెయిన్‌గా నిర్ధారించారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం అతడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందనున్నాడు.
దీంతో ఇప్పుడు అతడి స్థానం భర్తీకి సెలక్టర్లు కసరత్తులు షురూ చేశారు. సుందర్ స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను (Ravi Bishnoi) టీ20 జట్టులోకి తీసుకున్నారు. గాయంతో జట్టుకు దూరమైన తిలక్ వర్మ స్థానంలో తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) అవకాశం ఇచ్చారు. తిలక్ వర్మ ప్రస్తుతం గ్రోయిన్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. గాయం పూర్తిగా మానకపోవడంతో శారీరక శిక్షణ ఇంకా ప్రారంభించలేదు. నైపుణ్య శిక్షణ మొదలైన తర్వాత అతడి పరిస్థితిపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బీసీసీఐ (BCCI) తెలిపింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 21న నాగ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది. ప్రపంచకప్‌కు ముందు మంచి ఊపు సాధించడమే భారత్ లక్ష్యం.
అప్‌డేటెడ్ భారత టీ20 జట్టు (T20 Squad): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్, రవి బిష్ణోయ్.
Read Also: డబ్ల్యూపీఎల్‌లో ఆర్‌సీబీ హవా.. టాప్ ప్లేస్ సొంతం..
Follow Us On : WhatsApp


