కలం, వెబ్ డెస్క్: సీజన్స్‌తో సంబంధం లేకుండా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రతి యేటా పొల్యూషన్ పెరిగిపోతోంది. దీనికి శాశ్వతంగా చెక్ పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి 4 సంవత్సరాల్లో ప్రణాళికను రూపొందించింది. ప్రజా రవాణా, విద్యుత్ వాహనాలు, గాలి కాలుష్య నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
మార్చి 2029 నాటికి ఢిల్లీ బస్సుల సంఖ్యను ప్రస్తుత బస్సుల సంఖ్య నుంచి 4,000కి పెంచడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. ఈ బస్సులను మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నట్లు అధికారులు తెలిపారు. 10 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఈ-ఆటోలు, బైక్ టాక్సీలు, క్యాబ్‌లను అనుసంధానించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 36,000 ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అందబాటులోకి రానున్నాయి. అలాగే ఢిల్లీ అంతటా 3,300 కి.మీ. రోడ్లను పునర్నిర్మించడానికి లేదా అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించింది. కాలుష్య (Pollution) నివారణకు అన్ని విభాగాలు సమర్థమంతంగా పనిచేస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చెప్పారు.


