epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం పర్యటన..

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉమ్మడి జిల్లాల్లో పర్యటనకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ (శుక్రవారం) ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటించి చనాకా-కొరటా బ్యారేజీ, సదర్మాట్ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేశారు. రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటనలో భాగంగా జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి TGSWREIS ఆవరణలో మహబూబ్ నగర్ IIIT కి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మహబూబ్ నగర్ పట్టణంలోని MVS డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

ఆదివారం (జనవరి 18)న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత పాలేరు (Paleru) నియోజకవర్గంలో జరగనున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు లతో కలిసి పాల్గొంటారు. అదే రోజున ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న సీపీఐ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మేడారంలోని టూరిజం హోటల్ (హరిత ప్లాజా)లో క్యాబినేట్ సమావేశం జరగనుంది. రాత్రి మేడారంలోనే మంత్రులతో కలిసి సీఎం బస చేస్తారు. 19వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ (Revanth Reddy) దర్శించుకుంటారు.

Read Also: ఫడ్నవీస్ మరో ‘ధురంధర్’

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>