కలం, వెబ్ డెస్క్ : నటి అనసూయ (Anasuya) తన మీద వస్తున్న ట్రోల్స్, ఆన్ లైన్ వేధింపులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2025 డిసెంబర్ 23 నుంచి తన మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, దారుణమైన ట్రోల్స్, వేధింపులు ఎక్కువగా వస్తున్నాయని ఫిర్యాదులో తెలిపారు. 42 మందిపై అనసూయ ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. శేఖర్ భాషా, బొజ్జ సంధ్యారెడ్డి, పావని, కరాటే కల్యాణి, టీవీ యాంకర్లు మనోజ్, రోహిత్ తో పాటు కొన్ని టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల మీద అనసూయ కేసు పెట్టారు.
తనను బూతులు తిడుతున్నారని.. ఏఐ ఫోర్జరీ వీడియోలు, ఫొటోలతో తన పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆన్ లైన్ లో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అనసూయ తెలిపింది. తాను మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే.. ఇలా తనను మానసికంగా హింసిస్తున్నారంటూ ఆమె వాపోయింది. అనసూయ (Anasuya) ఫిర్యాదులో సెలబ్రిటీలు, కొందరు పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. నటుడు శివాజీ హీరోయిన్ల బట్టలపై చేసిన కామెంట్లపై అనసూయ రియాక్ట్ అవుతూ రెండు వీడియోలు చేసింది. ఆడవారు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు అంటూ ఆమె చేసిన వీడియోలపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఆమె ఏదో ఒక వీడియో లేదా పోస్టు పెడుతూనే ఉంది. నిన్న లైవ్ వీడియోలో తనమీద వస్తున్న ట్రోల్స్ గురించి చెప్తూ అనసూయ ఏడ్చేసింది.
Read Also: మరో ఫీట్ సాధించిన చరణ్ పాట
Follow Us On : WhatsApp


