కలం, వెబ్‌డెస్క్: బీటెక్,డిగ్రీ, పీజీ చదివిన.. భారత నౌకాదళం (Indian Navy SSC) లో ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలనుకునే ఆసక్తి కలిగిన పెళ్లికాని యువతీ యువకులకు గోల్డెన్ ఛాన్స్. నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) కోర్సు ద్వారా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ విభాగాల్లోని మొత్తం 260 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ నెల 24 నుంచి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరి తేదీ 24, ఫిబ్రవరి 2026. ఎంపికైనవాళ్లకు వచ్చే ఏడాది(2027) జనవరిలో ఎలిమల(కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లోఈ కోర్సు మొదలవుతుంది.
బ్రాంచ్‌లు – పోస్ట్‌లు
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్(జీఎస్(ఎక్స్)/హైడ్రో కేడర్) – 76
పైలెట్ – 25
నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్(అబ్జర్వర్స్) – 20
ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) – 18
లాజిస్టిక్స్ – 10
ఎడ్యుకేషన్ – 15
ఇంజనీరింగ్ బ్రాంచ్(జీఎస్) – 42
సబ్‌మెరైన్ టెక్ ఇంజనీరింగ్ – 08
ఎలక్ట్రికల్బ్రాంచ్(జీఎస్) – 38
సబ్‌మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ – 08
అర్హతలు:
దరఖాస్తుదారులు సంబంధింత పోస్టులను అనుసరించి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/పీజీ డిప్లొమా/డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కనీసం 60శాతం మార్కులు తప్పనిసరి. భారత నేవీ (Indian Navy SSC) నిబంధనల ప్రకారం నిర్దిష్ట వయసుతోపాటు ఎత్తు, బరువు, ఛాతీ కొలతలు ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మార్కుల, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ అనంతరం ఎంపిక చేస్తారు. ఎంపికైనవాళ్లకు కేరళలోని ఎలిమలలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుంటే ఉద్యోగం ఇస్తారు. ప్రారంభ వేతనం రూ.1.25లక్షలు ఉంటుంది.
నోట్: పూర్తి వివరాలకు www.joinindiannavy.gov.in లోని నోటిఫికేషన్లో ఉన్న వివరాలు చదవగలరు.


