epaper
Friday, January 16, 2026
spot_img
epaper

మరో ఫీట్ సాధించిన చరణ్ పాట

కలం, వెబ్ డెస్క్ : రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా ఆడియోతోనే సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలోని చికిరి చికిరి పాట (Chikiri Chikiri song) సెన్సేషనల్ హిట్ అయ్యింది. తాజాగా ఈ పాట మరో మైల్ స్టోన్ చేరుకుంది. చికిరి చికిరి పాట 200 మిలియన్ ఫ్లస్ వ్యూస్ దక్కించుకుంది. మూవీ టీమ్ ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. చికిరి చికిరి పాట పెద్ది సినిమాకు మంచి బిగినింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా ఈ సినిమా ఎలా ఉంటుంది, క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి, నేపథ్యం ఏంటి అనే ప్రశ్నలకు ఎంతో కొంత క్లారిటీ ఇచ్చింది చికిరి చికిరి పాట.

ఈ పాటను హిట్ చేసుకోవడం ద్వారా పెద్ది విషయంలో డైరెక్టర్ బుచ్చిబాబు విజన్ సరైన దిశలోనే వెళ్తోందని అందరికీ అర్థమైంది. రెహమాన్ లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తో మన నేటివ్ సాంగ్ చేయించుకోవడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యారు. చికిరి అనే ఉత్తరాంధ్ర ప్రాంత పదంతో పాట డిజైన్ చేసుకుని హిట్ కొట్టాడు దర్శకుడు.

ఈ పాటకు రెహమాన్ ఇచ్చిన ట్యూన్, జావెద్ అలీ పాడిన విధానం, జానీ మాస్టర్ రామ్ చరణ్, జాన్వీతో వేయించిన వైరల్ స్టెప్స్ మెమొరబుల్ గా మార్చేశాయి. చికిరి చికిరి పాటకు 200 మిలియన్ ఫ్లస్ డిజిటల్ వ్యూస్ తో పాటు సోషల్ మీడియాలో ఈ పాటకు భారీ స్థాయిలో రీల్స్ వచ్చాయి. పుష్ప ఆర్ఆర్ఆర్ సినిమాలకు ఎలాగైతే దేశ విదేశాల్లో రీల్స్ చేశారో అలాగే పెద్ది సినిమా పాటకు కూడా ఫారినర్స్ రీల్స్ చేస్తూ వచ్చారు. పెద్ది సినిమా మరికొద్ది రోజుల్లోనే థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాతో రామ్ చరణ్ మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. మరి.. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>