కలం వెబ్ డెస్క్ : మంత్రుల శాఖలపై స్పందిస్తూ తనపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావును చూస్తేనే జాలేస్తుందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో 20 శాతం సర్పంచ్ స్థానాలు కూడా గెలవలేదన్నారు. వైయస్ఆర్ లాగానే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా ఏ శాఖలో జోక్యం చేసుకోరని వెల్లడించారు. ఆయా శాఖల్లో మంత్రులదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడే వారికి సమాధానం చెప్పేంత సమయం తమకు లేదని చెప్పారు.
గతంలో పుష్ప 2 కు సంబంధించిన ఘటన జరిగినప్పుడు ఇకముందు బెనిఫిట్ షో కొత్త రేట్లు ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా సీఎం, తాను చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత సీఎంతో చర్చించి ఒక వేళ ధరలు పెంచితే 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొన్ని సినిమాలకు అనుమతులు ఇస్తే కోర్టు అభ్యంతరం తెలిపిందన్నారు. ఆ సమయంలో తాను నగరంలో లేనని, ఆ సమయంలో జీవో ఇచ్చారని చెప్పారు. నల్గొండ కార్పొరేషన్ అయిన సందర్భంగా, తాను కొన్ని పనుల్లో బిజీగా ఉండటం వల్ల ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. హరీశ్ రావు పని లేక చేస్తున్న వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

Read Also: శ్రీరాముడు బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడా?: పీసీసీ చీఫ్ కామెంట్స్
Follow Us On : WhatsApp


