ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. డీలిమిటేషన్​ పై కీలక మంతనాలు!

కలం, వెబ్​ డెస్క్​: తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం, ఇండీ కూటమి నేతలతో చర్చించేందుకు శనివారం హస్తినకు చేరుకున్నారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు సమాచారం.

డీలిమిటేషన్​ తో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం బలహీనపడే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో రేవంత్​ దృష్టి సారించనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన కీలక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు తెలంగాణకు సంబంధించి అభివృద్ధి పనులు, పెండింగ్​ బిల్లులపై కేంద్రమంత్రులతోనూ సీఎం రేవంత్​ (CM Revanth Reddy) భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్​ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>