కలం, నిర్మల్: ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు (SI Exam) హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఆదివారం నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు వెళ్లే అభ్యర్థుల కోసం ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

