దీక్షా దివస్‌పై బీఆర్ఎస్‌కు ప్రవీణ్ రావు కౌంటర్

కలం, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటులో గళమెత్తి, బిల్లు ఆమోదం పొందడంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేషన్ విప్, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు (Boinapally Praveen Rao) అన్నారు. శనివారం బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకల్లో ప్రవీణ్ రావు పాల్గొన్నారు. కరీంనగర్‌లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ ఎంతో పోరాడిందని ప్రవీణ్ రావు గుర్తు చేశారు. ముఖ్యంగా ‘తెలంగాణ చిన్నమ్మ’గా పేరుగాంచిన దివంగత నేత సుష్మా స్వరాజ్ చట్టసభల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం బలంగా పోరాడారని కొనియాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతుగా నిలవడం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీరుపై ప్రవీణ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ‘దీక్షా దివస్’ పేరిట బీఆర్ఎస్ నాయకులు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సెంటిమెంట్ రాజకీయాలను నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>