26/11.. అమ‌రుడి ఇంటికి అతిథిగా అడివి శేష్‌

క‌లం, సినిమా: 26/11 ముంబై ఉగ్రదాడులు 18వ ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు, డైరెక్ట‌ర్‌ అడివి శేష్ (Adivi Sesh), వీరమరణం పొందిన ఎన్ఎస్‌జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) తల్లిదండ్రులను కలిశారు. తాజ్ మహల్ హోటల్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా 2022లో వచ్చిన మేజర్ చిత్రంలో అడివి శేష్ నటించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్ర‌దాడులు జ‌రిగిన 26/11 రోజు సందీప్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన శేష్ వారితో ఆప్యాయంగా గ‌డిపారు. ఈ స్వీట్ మెమొరీస్‌కు సంబంధించిన‌ ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

సందీప్ తండ్రి ఉన్నికృష్ణన్‌తో కలిసి కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ.. “వారు నవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని అడివి శేష్ ఎమోష‌న‌ల్‌గా రాసుకొచ్చారు. గతంలోనూ ఆయన సందీప్ తల్లిదండ్రుల పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ “లవ్ యు అమ్మా, అంకుల్.. మిమ్మల్ని తరచూ కలుస్తానని మాటిస్తున్నాను” అంటూ పోస్ట్ చేశారు. సినిమా షూటింగ్ సమయం నుంచే సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబంతో అడివి శేష్‌కు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. సినిమా పూర్తయిన తర్వాత కూడా వారిని తన సొంత కుటుంబ సభ్యులుగానే శేష్ చూసుకుంటున్నారు. తాను నిజజీవితంలో మేజర్ సందీప్ కాలేకపోయినా, ఆయన తల్లిదండ్రులకు రెండో కొడుకుగా మాత్రం ఉండగలనని అడివి శేష్ గతంలో పలు సందర్భాల్లో తన మనసులోని మాటను వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>